calender_icon.png 26 December, 2024 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డిఓ జయచంద్ర రెడ్డి

08-11-2024 03:31:42 PM

వెల్దుర్తి (విజయక్రాంతి): మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి హస్తాల్పూర్, నెల్లూరు పలు గ్రామాలలో ఐకెపి సెంటర్ ఆధ్వర్యంలో నడుస్తున్నటు వంటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తూప్రాన్ ఆర్టీవో జయచంద్రరెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు శ్రమించి తాము పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని అయన తెలిపారు. ఏ గ్రేడ్ 2320, అని సాధారణం 2300 రూపాయలు ధర ఉన్నాయని తెలిపారు. సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ కూడా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ భరత్ రెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.