17-04-2025 01:20:05 AM
- రికార్డుల పరిశీలన
- ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు
పటాన్ చెరు, ఏప్రిల్ 16 : అమీన్ పూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. వివిధ అవసరాల కోసం కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన దరఖాస్తులను వెంటవెంటనే పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అమీన్ పూర్ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవకుండా తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై డీఎస్పీతో చర్చించామన్నారు. అలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటస్వామి, ఉప తహసీల్దార్ హరిచంద్ర ప్రసాద్, ఆర్‌ఐ లు రఘునాథరెడ్డి, శ్రీమాన్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.