బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ గురువారం ఎంపీడీవో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలపై స్థానిక అధికారులు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు తీసుకున్న ఆర్డీవో హరికృష్ణను ఎంపీడీవో మహేందర్, సూపరింటెండెంట్ వేణుగోపాల్, కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు.