calender_icon.png 8 April, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరిసిన ఆర్సీబీ

08-04-2025 01:35:59 AM

  1. ముంబైపై విజయం సాధించిన ఆర్సీబీ
  2. విరాట్ కోహ్లీ, పాటిదార్ అర్ధ సెంచరీలు
  3. ఉత్కంఠగా మ్యాచ్

ముంబై, ఏప్రిల్ 7: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో మ్యాచ్ గెలిచింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 12 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయఢంకా మోగించింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరికి విజయం బెంగళూరునే వరించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (67), కెప్టెన్ పటీదార్ (64) అర్ధ సెంచరీలు చేశారు. 222 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన ముంబై  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయడంతో హోం గ్రౌండ్‌లో ఓటమిని అంగీకరించక తప్పలేదు.

హర్ధిక్ పాండ్యా (42) (15 బంతుల్లో) ఆశలు రేపినా విజయం మాత్రం ముంబై దరి చేరలేదు. నేడు డబుల్  హెడర్‌లో భాగంగా.. మధ్యాహ్నం కేకేఆర్, ఎల్‌ఎస్‌జీ.. రాత్రి పంజాబ్, చెన్నై జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.