calender_icon.png 15 April, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్సీబీ అలవోకగా.. ముంబై ఉత్కంఠగా

14-04-2025 01:58:11 AM

బెంగళూరు, ముంబై విజయాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు విజయాలు సాధించాయి. బెంగళూరు 9 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై, ముంబై 12 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయకేతనం ఎగురవేశాయి. బెంగళూరులో కోహ్లీ, సాల్ట్ అదరగొట్టగా ముంబైలో తిలక్, కర్ణ్ శర్మ గెలుపుకు సహకరించారు.

ఒకానొక దశలో ఢిల్లీ అలవోకగా విజయం సాధిస్తుందని అనుకున్నా ముంబై బౌలర్ల సమష్టి ప్రదర్శనతో ముంబైని విజయం వరించింది. బుమ్రా వేసిన 19వ ఓవర్లో ముగ్గురు ఢిల్లీ బ్యాటర్లు రనౌట్లుగా వెనుదిరిగారు. ఢిల్లీకిది ఈ సీజన్‌లో తొలి ఓటమి. ఢిల్లీ తరఫున కరుణ్ నాయర్ (8౯) బరిలోకి దిగాడు.

చివరగా 2022 సీజన్‌లో ఆడిన కరుణ్ మళ్లీ 1077 రోజుల నిరీక్షణ తర్వాత బరిలోకి దిగాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన నాయర్ తనదైన ముద్ర వేశాడు. ముంబై తరఫున ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కర్ణ్ శర్మ (3/36) ఢిల్లీ నడ్డివిరిచాడు. నేడు లక్నో, చెన్నైల మధ్య పోరు జరగనుంది. వరుసగా రెండు ఓటముల తర్వాత ముంబై గెలుపు రుచి చూసింది.