సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తనదైన స్టుల్‌తో దూసుకుపోతున్న జగపతిబాబు. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ‘ఆర్‌సీ 16’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం లో ఓ కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. ఈ విషయమై ఆయన తాజాగా ‘ఆర్‌సీ 16’ షూటింగ్ కోసం సిద్ధమవుతున్న వీడియోను నెట్టింట షేర్ చేశారు. “చాలా కాలం తర్వాత బుచ్చిబాబు ఆర్‌సీ 16 కోసం పనిపెట్టాడు.
గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించింది” అని పేర్కొన్నారు. జగపతిబాబుకు మేకప్ వేస్తున్న ఈ వీడియో చూపరులను ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పెట్టారంటూ ప్రచారం జరుగుతోంది.