ఘట్‌కేసర్‌లో స్థానికుల నిరసన ర్యాలీ
ఘట్‌కేసర్, నవంబర్ 3: ఘట్‌కేసర్ పట్టణంలో 15 సంవత్సరాల క్రితం ప్రారంభించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి ని వెంటనే పూర్తిచేయాలని పట్టణ ప్రజలు ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రైల్వేలైన్‌పై అధికారులు బ్రిడ్జి నిర్మించి 10 ఏళ్లు పూర్తయ్యాయని..
రాష్ట్ర ప్రభుత్వం 500 మీటర్ల వంతెన నిర్మించేందుకు 15 సంవత్సరాలు దాటినా పూర్తి చేయలేదని విమర్శించారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టి మధ్య లో ఆపేయటంతో కనీసం బస్సు సౌకర్యం కూడా లేకుండా పోయిందని వాపోయారు. వెంటనే పనులు పూర్తి చేయకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరసన ర్యాలీలో మాజీ ఎంపీపీలు సుదర్శన్ రెడ్డి, బండారి శ్రీనివాస్ గౌడ్, జేఏసీ చైర్మన్ మారం లక్ష్మారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.