11-02-2025 12:38:30 AM
హైదరాబాద్(విజయక్రాంతి) : దాదాపు అయిదేళ్ల తర్వాత తొలిసారి ఆర్‌బీఐ కీలక వడ్డీ రేటుఅయిన రెపో రేటును పావుశాతం మేరకు తగ్గిస్తూ తీసుకొన్న నిర్ణయం అన్ని వర్గాలకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఇప్పటికేఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌లో ఎవరూ ఊహించని విధంగా రూ.12 క్షల వరకు ఆదాయం పన్ను ఊరట కల్పించి మధ్య తరగతి ప్రజలు పండగ చేసుకునేలాచేశారు.
తాజాగా ఆర్‌బీఐ కూడా కీలక రెపో రేటును పావుశాతంమేరకు తగ్గించడంతో గృహ, వాహన రుణాల ఈఎంఐల లో భారీగా ఊరట లభించనుంది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగిస్తున్న తరుణంలో కొత్త చైర్మన్ మల్హోత్రా నేతృత్వంలో సమావేశమైన ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం విశేషం.
కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు మరిరిత తగ్గే అవకాశం ఉండడంతో తాము ఈ నిరణయం తీసుకొన్నట్లు మల్హోత్రా తెలిపారు. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో గృహ, వాహన రుణాల ఈఎంఐలు తగ్గడంతో పాటుగా జనం చేతిలో డబ్బులు ఆడనున్నాయి.ఈ సొమ్మంతా తిరిగిP మార్కెట్లోకి రావడం వల్ల ఆర్థిక వృద్ధికి ఊతం లభిస్తుంది.
ముఖ్యంగా ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం ప్రభావం హౌసింగ్ రంగంపై మంచి సానుకూల ప్రభావం చూపనుంది. గృహ రుణా లు వడ్డ్డీ రేట్లు తగ్గనుండడంతో ఇళ్లు కొనుగోలు చేయాలనుకునే మధ్య తరగతి సంఖ్య పెరుగుతుంది. అలాగే బిల్డర్లు కూడా కొత్త వెంచర్లను ప్రారంభించడంతో పాటుగా సకాలంలో కస్టమర్లకు ఇళ్లను అందించగలుగు తారు.
ఏది ఏమయిన ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం అటు ప్రభుత్వ ఆర్థిక విధానాలకు ఊతమివ్వడంతో పాటుగా ఇటు మధ్య తరగతివారికి సైతం ఎంతో ఊరట కల్పిస్తుందన డంలో సందేహం లేదని ప్రముఖ రిసెర్చ్ సంస్థ బ్రిక్‌వర్క్ అభిప్రాయపడింది.