calender_icon.png 10 October, 2024 | 3:51 PM

అక్టోబర్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించదు

03-10-2024 12:00:00 AM

బీవోబీ రిపోర్ట్

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: రిజర్వ్‌బ్యాంక్ ఈ అక్టోబర్ ద్రవ్య విధాన పరపతి సమీక్షలో కీలక వడ్డీ రేట్లను తగ్గించబోదని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తాజా రీసెర్చ్ రిపోర్ట్‌లో అం చనా వేసింది. రేట్ల కోతల్ని ప్రారంభించేముం ద, ద్రవ్యోల్బణం ట్రెండ్స్‌పై మరింత స్పష్టత కోసం ఆర్బీఐ వేచిచూస్తుందని, ఆర్థికాభివృద్ధి పటిష్ఠంగా ఉన్నా, ఆర్థిక వ్యవస్థ సంకేతాలు మిశ్రమంగా ఉన్నాయని బీవోబీ వివరించిం ది.

అందుచేత వచ్చే పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల ను తగ్గించడం లేదా విధాన వైఖరిని కఠినం నుంచి సరళానికి మార్చుకోవడం ఉండదని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం తగ్గనున్నప్పటికీ, దీర్ఘకాలిక ట్రెండ్‌లో మరింత స్పష్టత కోసం కొత్తగా ఏర్పాటైన మానిటరీ పాలసీ కమిటీ వేచిచూస్తుందని బీవోబీ రిపోర్ట్ పేర్కొంది. 

డిసెంబర్‌లో తగ్గే అవకాశం

అక్టోబర్ 7 నుంచి రిజర్వ్‌బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం ప్రారంభమవుతుంది. మూడు రోజుల సమీక్ష తర్వాత 9న వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఆహారోత్పత్తుల ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నందున, ఈ దశలో రేట్ల కోతపై ఆర్బీఐ జాగ్రత్తగా వ్యవహరిస్తుందని బీవోబీ  తెలిపింది.

ద్రవ్యోల్బణం క్రమేపీ తగ్గుముఖం బాట పడుతుందన్న విశ్వాసం ఏర్పడితే డిసెంబర్ పాలసీ సమీక్షలోనే రేట్ల కోతకు అవకాశం ఉంటుందని అంచనా వేసింది. తాజా పంట దిగుబడులు మార్కెట్లోకి రానున్నందున కూరగాయల ధరలు దిగివచ్చే అవకాశం ఉన్నదని, దీంతో రానున్న నెలల్లో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని, కోర్ ఇన్‌ఫ్లేషన్ 4 శాతం దిగువనే కొనసాగవచ్చని రిపోర్ట్‌లో వివరించింది.

అయితే ఉపసంహరణ సమయంలో వర్షపాతం ఉంటే పంటలు దెబ్బతింటాయని, తద్వారా ఆహార ద్రవ్యోల్బణం పెరగవచ్చని బీవోబీ రిపోర్ట్ హెచ్చరించింది.