calender_icon.png 3 October, 2024 | 9:56 AM

యాక్సిస్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లకు ఆర్బీఐ పెనాల్టీ

11-09-2024 12:00:00 AM

ముంబై, సెప్టెంబర్ 10: కొన్ని రెగ్యులేటరీ నిబంధనల్ని సరిగ్గా పాటించకపోవడంతో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లకు రిజర్వ్ బ్యాంక్ పెనాల్టీలు విధించింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లకు సం బంధించి, కేవైసీ, తనఖా లేకుండా వ్యవసాయ రుణాలు మంజూరుచేయడంలో కొన్ని ఆదేశాలను పాటిం చకపోవడం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడంతో యాక్సిస్ బ్యాంక్‌కు రూ.1.91 కోట్ల జరిమానా విధించినట్లు మంగళవారం ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.  అలాగే డిపాజిట్లపై వడ్డీ రేట్లు, బ్యాంక్‌లు నియమించుకునే రికవరీ ఏజెంట్లు, కస్టమర్ సర్వీసులకు సంబంధించిన కొన్ని ఆదేశాలు అమలుచేయకపోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు రూ.1 కోటి పెనాల్టీ వేసినట్టు ఆర్బీఐ వెల్లడించింది.