25-02-2025 12:05:20 AM
24 నుంచి 28 వరకు కార్యక్రమాలు
జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్
మెదక్, ఫిబ్రవరి 24(విజయ క్రాంతి): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఆర్దిక అక్షరాస్యత, మహిళా సాధికారతపై ఫిబ్రవరి 24 నుండి 24 వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల కొరకు ఆర్థిక ప్రణాళిక, పొదుపు నష్ట నివారణ చర్యలు ,ఆర్థిక పరిపుష్టికి రుణాలు పొందడం, గృహ రుణాలు, ఉద్యోగినులకు, స్వయం ఉపాధి పొందాలనే మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహిళా సంఘా ల ట్రాన్స్ ఉమెన్స్‌కి, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యాంపు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 25న జిల్లా కేంద్రంలో 2K రన్ నిర్వహించడం జరుగుతుందని ఇందులో మహిళా సంఘాలతో పాటు కళాశాల విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు . ఈ కార్యక్రమాన్ని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుం దని అదనపు కలెక్టర్ తెలిపారు.