calender_icon.png 9 October, 2024 | 1:56 PM

కీలక వడ్డీ రేట్లు సేమ్: ఆర్బీఐ

09-10-2024 11:15:54 AM

న్యూఢిల్లీ:  విశ్లేషకులు అంచనా వేసినట్లే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆరుగురు సభ్యుల ఆర్ బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) మూడు రోజుల సమావేశ నిర్ణయాలను ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ప్రకటించారు. రెపో రేటును 6.5శాతం వద్ద యథాతథంగా ఉంచాలని రేట్ సెట్టింగ్ ప్యానెల్ నిర్ణయించినట్లు ప్రకటించారు. 

వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవడం వరుసగా ఇది పదవ సారిని ఆయన పేర్కొన్నారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును యథాతథంగా కొనసాగిస్తూ వస్తుందన్నారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 6.75 శాతంగా ఉంచింది. 2024-25 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 6.7 శాతంగా అంచనా వేశారు. ఆర్థిక రంగం స్థరంగా ఉందని చెప్పిన ఆర్బీఐ గవర్నర్ బ్యాంకుల కార్యకలపాలు బలంగా ఉన్నాయని చెప్పారు. అటు యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ. 2000 వేల నుంచి రూ. 5 వేలకు పెంచినట్లు వెల్లడించారు.