వరల్డ్ గోల్డ్ కౌన్సిల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంక్‌లు 60 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయని, అందులో 27 టన్నులు భారత్ కేంద్ర బ్యాంక్ ఆర్బీఐనే కొన్నదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ఈ కొనుగోళ్లతో ఈ ఏడాది జనవరి మధ్య 10 నెలల కాలంలో ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు 77 టన్నుల మేర పెరిగాయని కౌన్సిల్ వివరించింది. నిరుడు తొలి పదినెలలతో పోలిస్తే ఆర్బీఐ బంగారం కొనుగోళ్లు ఈ ఏడాది ఐదు రెట్లు పెరిగాయన్నది. తాజా గణాంకాల ప్రకారం ఆర్బీఐ వద్ద ప్రస్తుతం 882 టన్నుల బంగారం నిల్వలు ఉండగా, అందులో 510 టన్నుల్ని భారత్‌లోనే భద్రపర్చింది. ఈ ఏడాది జనవరి ఆర్బీఐ తర్వాత అత్యధిక బంగారాన్ని కొన్న కేంద్ర బ్యాంక్‌ల్లో టర్కీ (72 టన్నులు), పోలాండ్ (69 టన్నులు) ఉన్నాయి.