calender_icon.png 16 October, 2024 | 6:01 PM

అధిక వడ్డీ కోసం ఆర్బీఐ బాండ్లు

29-09-2024 12:00:00 AM

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకంటే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ రాబడిని పొందే అవ కాశం ఉన్నప్పటికీ, రిస్క్ కూడా ఉంటుందన్న భయంతో చాలామంది  పొదుపుదారులు వాటి జోలికి పోరు. అదే సమయంలో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకంటే అధిక వడ్డీనిచ్చే సురక్షిత సాధనాలు ఇంకా ఏమి ఉన్నాయో సాధారణంగా అన్వేషిస్తుంటారు.

అటువంటి వారు మదుపు చేయడానికి అనువైనవి రిజర్వ్‌బ్యాంక్ జారీచేసే బాండ్లు. ఆర్బీఐ బాండ్లు అంటే బ్యాంక్‌లు, ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేవని పలువురు భావిస్తూ ఉంటారు. వాస్తవానికి వాటిలో వ్యక్తిగత మదుపుకారులు కూడా పెట్టుబడి చేయవచ్చు. బ్యాంక్‌లో ఎఫ్‌డీ చేసినంత సులభంగా ఆర్బీఐ బాండ్లను కొనవచ్చు.

పలు కాలపరిమితులుగల ఎఫ్‌డీలకంటే కాస్త వడ్డీ కూడా ఎక్కువే. స్వయానా రిజర్వ్‌బ్యాంకే వాటిని జారీచేస్తుంది కనుక రిస్క్ భయం కూడా ఉండదు. ఆర్బీఐ దఫాదఫాలుగా వివిధ రకాల బాండ్లను జారీచేస్తూ ఉంటుంది. ప్రస్తుతం 8.05 శాతం వార్షిక వడ్డీతో ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ పెట్టుబడి చేసేందుకు లభిస్తున్నాయి. 

ఎలా పెట్టుబడి చేయాలి?

ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్‌ను ఆన్‌లైన్‌లో కొనవచ్చు. లేదా ఆఫ్‌లైన్‌లోనూ తీసుకోవచ్చు. ఖాతాదారులు ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ వెబ్‌సైట్ లేదా బ్యాంక్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసి, వీటిని పొందవచ్చు. మీ బ్యాంక్ శాఖను సందర్శించి, ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో పెట్టుబడి చేయవచ్చు. బ్యాంక్ యాప్ ద్వారా కూడా ఈ బాండ్లను తీసుకోవచ్చు. 

ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్

కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ జారీచేస్తున్న ఈ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ (ఎఫ్‌ఆర్‌ఎస్ బాండ్లు)  రిటైల్ ఇన్వెస్టర్లకు స్థిర ఆదాయాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించినవి. పోస్టాఫీసులో లభించే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై (ఎన్‌ఎస్‌సీ) లభించే వడ్డీ రేటుకు 0.35 శాతం అదనంగా ఈ బాండ్ వడ్డీ రేటును నిర్ణయిస్తారు. ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకూ తీసుకునే బాండ్లకు 8.05 శాతం వడ్డీ రేటును  నిర్ణయించారు. ప్రతీ ఏటా రెండు దఫాలు వీటి వడ్డీ రేట్లను సవరిస్తారు. ఎన్‌ఎస్‌ఈపై వడ్డీ రేటును సవరిస్తే ఈ ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్‌పై వడ్డీ రేటు కూడా మారుతుంది. 

ఎలా పెట్టుబడి చేయాలి?

ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్‌ను ఆన్‌లైన్‌లో కొనవచ్చు. లేదా ఆఫ్‌లైన్‌లోనూ తీసుకోవచ్చు. ఖాతాదారులు ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ వెబ్‌సైట్ లేదా బ్యాంక్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసి, వీటిని పొందవచ్చు. మీ బ్యాంక్ శాఖను సందర్శించి, ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో పెట్టుబడి చేయవచ్చు. బ్యాంక్ యాప్ ద్వారా కూడా ఈ బాండ్లను తీసుకోవచ్చు. 

ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్‌లో ఖాతా

మీ గుర్తింపు పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించి ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్‌లో (rbiretaildirect.in) ఖాతాను ప్రారంభించవచ్చు. అటుతర్వాత ఆ ఖాతాలోకి లాగిన్ అయ్యి ‘FRSB’పై క్లిక్ చేసి ఇన్వెస్ట్ చేయవచ్చు. వాటికి చెల్లింపు చేసిన తర్వాత మీ ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ ఖాతాలోకి ఆ బాండ్లు వస్తాయి. 

వడ్డీ చెల్లింపు

వీటిపై నిర్ణయించిన వడ్డీని ప్రతీ నెలలకు ఒకసారి చెల్లిస్తారు. దీనిపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను ఎఫ్‌డీల తరహాలోనే ఉంటుంది. 

కనీస పెట్టుబడి 

ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో కనీస పెట్టుబడి రూ.1,000. ఆపై రూ. 1,000 గుణిజాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 

ఏడేండ్ల కాలపరిమితి

 ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లను ట్రేడ్ చేయడానికి వీలు లేదు. 7 ఏండ్ల లాక్ ఇన్ పిరియడ్ ఉంటుంది. సాధారణ పౌరులు ముందస్తుగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం లేదు. కానీ సీనియర్ సిటిజన్లు నిర్దేశిత కాలపరిమితి తర్వాత విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుం ది. వివిధ వయస్సులుగల సీనియర్ సిటిజన్లకు వేరుగా  కాలపరిమితులు ఉన్నాయి.