ముంబై, డిసెంబర్ 27: ప్రిపెయిడ్ పేమెంట్ ఇనుస్ట్రుమెంట్స్ (పీపీఐ) కలిగినవారు థర్డ్‌పార్టీ మొబైల్ అప్లికేషన్లతో యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి, డబ్బు పొందడానికి రిజర్వ్‌బ్యాంక్ అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం ఒక సర్క్యు లర్ జారీచేసింది.
గిఫ్ట్‌కార్డులు, మెట్రో రైల్ కార్డులు, డిజిటల్ వ్యాలెట్లు తదితర పీపీఐలను కలిగినవారికి మరింత వెసులుబాటు కల్గించేందుకు వాటికి యూపీఐ లావాదేవీలను అనుమతించింది.
ప్రస్తుతం బ్యాంక్ ఖాతాకు యూపీఐ లావాదేవీలను ఆయా బ్యాంక్ యూపీఐ అప్లికేషన్ లేదా ఏ ఇతర థర్డ్‌పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌ను ఉపయోగించి జరిపే వీలున్నది. అయితే పీపీఐ ఇష్యూయర్ అందించే మొబైల్ అప్లికేషన్ ద్వారా మాత్రమే పీపీఐకి యూపీఐ చెల్లింపులు చేయాలి. తాజా అనుమతితో థర్డ్ పార్టీ యాప్స్‌తో యూపీఐ ద్వారా పీపీఐకి చెల్లించవచ్చు. తీసుకోవచ్చు.