calender_icon.png 2 November, 2024 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాలో రజాకార్

21-07-2024 01:29:13 AM

హైదరాబాద్ సంస్థానంలో పుట్టిన రజాకార్

తాజాగా విద్యార్థుల ఉద్యమంలో మళ్లీ తెరపైకి

సైన్యాన్ని దించిన అదుపులోకి రాని అల్లర్లు

దేశం విడిచి వెళ్లిపోతున్న విదేశీయులు

ఢాకా, జూలై 20: ‘నువ్వెవరు? నేనెవరు? రజాకార్.. రజాకార్’.. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు ఈ నినాదం మారుమోగుతున్నది. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారటంతో బంగ్లా స్తంభించింది. దేశవ్యాప్తంగా సైన్యాన్ని మోహరించి, కర్యూ విధించినా పరిస్థితి అదుపులోకి రావటం లేదు. ఇప్పటికే ఈ అల్లర్లలో 115 మంది చనిపోయారు. శుక్రవారం విద్యార్థులు ఓ జైలును బద్దలుకొట్టి వందలమంది ఖైదీలను వదిలేశారు. జైలును తగులబెట్టారు. హింస అదుపు తప్పటంతో అక్కడున్న విదేశీయులు సొంత దే శాలకు వెళ్లిపోతున్నారు. బంగ్లాదేశ్‌లో చదువుతున్న దాదాపు వెయ్యి మంది భారతీయ విద్యార్థులు ఇప్పటికే స్వదేశానికి వచ్చేశారు. బంగ్లాదేశ్ విద్యార్థుల్లో, ప్రజల్లో ఉన్నట్టుండి ఇంత ఆగ్రహం ఎందుకు తలెత్తింది? ఇది సడన్‌గా వచ్చిన ఆగ్రహమా? నిజంగా రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమమేనా? షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటా?

హైదరాబాద్ నుంచి బంగ్లాదేశ్ వయా పాక్

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఇండియన్ యూనియన్‌లో చేరకుండా స్వతం త్రంగా ఉన్న సంస్థానాల్లో అతిపెద్దది హైదరాబాద్ సంస్థానమే. హైదరాబాద్ నిజాం ఇండియన్ యూనియన్‌లో చేరబోనని ధైర్య ంగా ప్రకటించారు. ఆ ప్రకటన వెనుక ఉన్న ధైర్యమే రజాకార్. హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా మార్చటమే లక్ష్యంగా కాసీ రిజ్వీ అనే మతఛాందసుడు సృష్టించిన సా యుధ దళమే ఈ రజాకార్. ఈ సంస్థ తెలంగాణలో చేయని అరాచకం లేదు. ఊర్లకు ఊర్లనే తగులబెట్టారు. చివరకు భారత యూ నియన్ ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవటంతో కాసీం రిజ్వీ పెట్టేబేడా సర్దుకొని పాకిస్థాన్‌కు పారిపోయాడు. పాక్‌లోనూ రజాకార్ భావజాలాన్ని పెంచి పోషించాడు. అది బంగ్లాదేశ్‌లో చెప్పలేని అరాచకాలు సృ ష్టించింది.

బంగ్లా విప్లవ వీరులపై అరాచకం

కాసీం రిజ్వీని ఆదర్శంగా తీసుకొని 19 71లో బంగ్లాదేశ్‌లో అతివాద సంస్థ జమాతే ఇ ఇస్లాం సభ్యుడైన మౌలానా అబుల్ కలామ్ ముహమ్మద్ యూసుఫ్ కొత్తగా రజాకార్ అనే సాయుధ దళాన్ని స్థాపించాడు. ఆ సంస్థలోకి బీహార్ నుంచి వలసపోయిన వాళ్లను, సామాజికంగా తీవ్ర అణచివేతకు గురైన వాళ్లను తీసుకొని సాయుధ శిక్షణ ఇచ్చారు. బంగ్లాదేశ్ విమోచన ఉద్యమకారులపై ఈ సంస్థ చేయని దారు ణాలు లేవు. అందుకే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత రజాకార్ సంస్థను నిషేధించారు. 

తెరపైకి ఇప్పుడెందుకు?

బంగ్లాదేశ్‌లో ఉద్యోగ నియామకాల్లో వివి ధ వర్గాలకు కలిపి మొత్తం 56 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఉద్యోగాలు సగానికిపైగా రిజ ర్వేషన్ కోటాకే వెళ్తుండటంతో విద్యార్థుల్లో అ సహనం పెరిగిపోతున్నది. ప్రధాని హసీనా ఈ నెల 14న చేసిన ఓ ప్రకటన మంటల్లో పెట్రోల్ పోసినట్టుగా మారింది. ‘కోటా (రిజర్వేషన్లు) ప్రయోజనాలు ఉద్యమకారుల పిల్లలు కాకుండా.. రజాకార్ల మనవళ్లకు ఇవ్వాలా?’ అని ఆమె ప్రశ్నించారు. అదే మాటను విద్యార్థులు నినాదంగా మార్చుకొన్నారు. 

ప్రధానిపై తీవ్ర వ్యతిరేకత

బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమ నాయకుడు ముజీబుర్ రెహమాన్‌ను ఆ దే శ పితగా భావిస్తారు. ఆయన కూతు రే ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా. ఆమె 1996 నుంచి 2001 వరకు బంగ్లా ప్రధానిగా పనిచేశారు. రెండోసారి 20 09లో ప్రధాని అయ్యారు. ఇప్పటికీ ఆమె గుప్పిట్లోనే దేశం ఉన్నది. గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత ఖలీ దా జియాతోపాటు విపక్ష నేతలందరినీ జైళ్లలో పెట్టి పోలీస్ రాజ్యం సృష్టిం చారు. విపక్షాలు బలహీనపడిన త ర్వాత ఎన్నికలు నిర్వహించి మళ్లీ అధికారంలోకి వచ్చారు. దీంతో బంగ్లాదేశీయుల్లో ఆమెపై పీకల్లోతు కోపం ఉన్నది.