calender_icon.png 8 February, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా రాయపూడి వెంకటనారాయణ నియమకం

08-02-2025 06:40:01 PM

కోదాడ: సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా మలిదశ ఉద్యమకారుడు రాయపూడి వెంకటనారాయణను ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు నియమక పత్రాన్ని శనివారం అందజేశారు. కోదాడ పట్టణంలోని సత్యబాబు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటనారాయణ మాట్లాడుతూ... నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పజెప్పిన అధ్యక్షునికి సహకరించిన ఆర్యవైశ్య పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్యవైశ్యులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తన దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్యబాబు, జి లక్ష్మణరావు, వంగవీటి శ్రీనివాసరావు పైడిమర్రి వెంకట్ నారాయణ పందిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.