calender_icon.png 17 March, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయపూడి ఉషాకు.. అభినందనలు..

17-03-2025 01:39:50 PM

సన్మానించిన ఆర్యవైశ్య మండల పట్టణ కమిటీ

వైరా,(విజయక్రాంతి): ఇటీవల మైసూర్ దత్తపీఠం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పారాయణం పోటీల్లో వైరాకు చెందిన ప్రముఖ వ్యాపారి రాయపూడి నారాయణరావు సతీమణి రాయపూడి ఉష బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మండల పట్టణ కమిటీ ఆమెను ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్య సంఘం మండల పట్టణ అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్, ధారా వెంకటకృష్ణ, మండల పట్టణ కార్యదర్శులు కొల్లా రాంబాబు, జల్లా అవినాష్, కోశాధికారులు సముద్రాల మురళి కృష్ణ, చల్లా వెంకటరమణ లు ఆమెను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఆర్యవైశ్య ప్రముఖులు వైరా వర్తక సంఘం అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు వనమా విశ్వేశ్వరరావు, డాక్టర్ పెరుమాళ్ళ  కృష్ణమూర్తి, కొప్పురావూరి వెంకటేశ్వరరావు మిట్టపల్లి సత్యం బాబు, నూకల శ్రీనివాసరావు (వాసు), గజ్జల కృష్ణమూర్తి, వజినే  పల్లి చక్రవర్తి, నూకల ప్రసాద్, కొణతాలపల్లి సుబ్బారావు, వనమా చిన్ని తదితరు పెద్దలు ఆమెకు అభినందనలు తెలిపారు.