calender_icon.png 6 April, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయపర్తి ఎస్‌బీఐ బ్రాంచీకి తాళం

05-04-2025 12:36:55 AM

గత నవంబర్‌లో చోరీ అయిన బంగారం ఇవ్వాలని బాధితుల డిమాండ్

జనగామ,  ఏప్రిల్ 4 (విజయక్రాంతి): తమ బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలువురు వినియోగదారులు బ్యాంకుకు తాళం వేసి నిరసన తెలిపిన సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తిలో జరిగింది. రాయపర్తి ఎస్‌బీఐలో గతేడాది న వంబర్ 18న భారీ చోరీ జరిగింది. అంతర్రాష్ట్ర ముఠా బ్యాంకులో చొరబడి వినియోగదారులు లాకర్లలో దాచుకున్న బంగారాన్ని అపహరించారు.

ఇది జరిగి ఆరు నెలలు గడిచి నా తమ సొమ్ముపై బ్యాంకు అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవ డంతో వినియోగదారులు ఆగ్రహానికి గురయ్యారు. తాము తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వాలని గతంలో వినియోగదారులు బ్యాంకు అధికారులను నిలదీశారు. ఆర్‌ఎం వచ్చాక మాట్లాడుదామని నచ్చజెప్పి బ్యాంకు మేనేజర్ వారిని పంపించారు.

శుక్రవారం బ్యాంకుకు ఆర్‌ఎం రాగా.. ఆ విషయాన్ని తెలుసుకున్న బాధితులు బ్యాంకుకు చేరుకున్నాను. తమ బంగారంపై క్లారిటీ ఇవ్వాలంటూ బ్యాంకుకు తాళం వేసి బ్యాంకు ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు.