గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ రెడ్డి’. అంజన్ రామచంద్ర, శ్రావణిరెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకు డు స్మరణ్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సునంద బి.రెడ్డి, హేమలతరెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్‌రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్‌రెడ్డి, నవీన్‌రెడ్డి నిర్మాతలు.
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఎస్‌కేఎన్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయించారు. ట్రైలర్ లవ్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంది.
తనది రెగ్యులర్ నిబ్బా నిబ్బీ లవ్‌స్టోరీ కాదని భావించే నారాయణరెడ్డి ఉరఫ్ లవ్‌రెడ్డిని తన ప్రేయసి ఎందుకు రిజెక్ట్ చేసింది. చివరకు వారి ప్రేమకథ ఎక్కడికి చేరిందనేది ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. రాయలసీమ నేపథ్యంతో, అక్కడి యాసలో సినిమా ఆకట్టుకోనుంది.