30-03-2025 08:36:14 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం జగదీష్ కాలనీ, లంబాడి కాలనీ మధ్య గల ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది సందర్భంగా ఆదివారం జరుగుతున్న జాతరలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానం పలికారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ మండల నాయకులు అయినాల రామకృష్ణ, కొలిపాక శివ, ఆలయ కమిటీ సభ్యులు గోసుల వెంకట శ్రీనివాస్, గొల్ల గణేష్ భాసిపోయిన నాగరాజు, గొల్ల అశోక్, రామకృష్ణ, జాగు సాయిరాం, తదితరులు ఉన్నారు.