calender_icon.png 18 April, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ సభకు భద్రాద్రి పట్టణం నుండి అధిక సంఖ్యలో కదలాలి..

15-04-2025 06:03:21 PM

పట్టణంలో ప్రతి వార్డులో 27న గులాబీ జెండా ఎత్తాలి...

మండల పార్టీ అనుబంధ రంగాల సమావేశంలో రావులపల్లి..

భద్రాచలం (విజయక్రాంతి): 25 సంవత్సరాల రజతోత్సవ బహిరంగ సభ వరంగల్ జరుగుతుందని పట్టణం నుండి వరంగల్ కు అధిక సంఖ్యలో శ్రేణులు కదలి రావాలని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో మండల పార్టీ అనుబంధ రంగాల కమిటీల సమావేశం మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ.. 27వ తేదీన భద్రాచలం పట్టణంలోని అన్ని వార్డులలో కార్యకర్తలు గులాబీ జెండా ఎత్తి వరంగల్ కు బయలుదేరారని.. తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ అభివృద్ధి చేసిన పార్టీ బిఆర్ఎస్ అన్నారు. 

అనంతరం నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ మాట్లాడుతూ.. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో వరంగల్ సభ జరగబోతుందని. గులాబీ కార్యకర్తలకు ఇది ఒక పండుగ వాతావరణంలో తెలంగాణ ప్రజల సొంత పార్టీ సభకు ప్రజలందరూ రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల పార్టీ కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు కొల్లం జయ ప్రేమ కుమార్, మండల పార్టీ నాయకులు కాపుల సూరిబాబు, మోరాల డానియల్ ప్రదీప్, గుంజ ఏడుకొండలు, అయినాల రామకృష్ణ,బద్ది బాబి, మోహన్ రావు, రావూరి రవి కిరణ్, జక్కం గోపి, ఇమంది నాగేశ్వరరావు, పసుపులేటి రమేష్, మహిళా నాయకులు పూజల లక్ష్మీ, ఏలూరి ప్రియాంక, తెల్లం రాణి, సలోమి తదితరులు ఉన్నారు.