బండ్లగూడ,(విజయక్రాంతి): బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ అధికారులు ప్రజాపాలన నిర్వహించారు. అధికారులపై బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల కోళ్ల నాగరాజు(BRS Party President Ravula Kolla Nagaraju) ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ సర్కార్ కాలం వెళ్లదీస్తున్న మండిపడ్డారు. రేవంత్ సర్కార్ ఒకవైపు సర్వేల పేరుతో ప్రభుత్వ ధనం వృధా.. మరోవైపు అప్లికేషన్ల పేరుతో ప్రజాధనం వృధా చేస్తుందని ఆరోపించారు. ఉత్తుత్తి సర్వేలు చేసి ఎందుకు మోసం చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నంక.. ఇప్పుడు గ్రామసభల్లో మళ్లీ ఎందుకు..? ప్రజాపాలనలో రేషన్‌కార్డుల కోసం ప్రత్యేకంగా తీసుకున్న దరఖాస్తులు ఏమైనయ్..? అని ప్రశ్నించారు.
రేవంత్ సర్కార్ పై గ్రామసభల్లో పెల్లుబికిన జనాగ్రహం
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్(Bandlaguda Jagir Municipal Corporation) బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల కోళ్ల నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ పరిధిలో ప్రజల తరఫున అధికార పార్టీ నాయకులను అధికారులను నిలదీశారు, బూటక వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి వాగ్దానాలు అమలు చేయలేక, తప్పించుకొనే ప్రయత్నం చేస్తుందని, ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇది జీర్ణించుకోని కాంగ్రెస్ నాయకులు మైకు లాక్కొని ఎదురుదాడి చేయడం హేయమైన చర్య, ప్రజల తరఫున 6 గ్యారంటీలు అమలయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని, నిరంతరం ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు.