18-02-2025 06:01:10 PM
మందమర్రి (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తను ఆదరించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ రవీందర్ సింగ్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పట్టణంలో పట్టభద్రులను కలిసి ప్రచారం నిర్వహించారు. ఉదయం సింగరేణి హైస్కూల్ మైదానంలో మార్నింగ్ వాక్ లో బాగంగా వాకర్స్ తో కలిసి తనను ఆదరించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం పట్టణంలోని మార్కెట్ పాలచెట్టు, పాత బస్టాండ్ ప్రాంతాల్లో పట్టభద్రులను కలిసి తనను గెలిపించాలని ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు జిల్లాల పరిధిలో నిరుద్యోగుల గొంతును శాసనమండలిలో వినిపించి పట్ట భద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పట్టబద్రులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, ఉద్యోగాల భర్తీ కోసం తన గళం వినిపిస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్లో మేయర్ గా బాధ్యతలు చేపట్టి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. పట్టభద్రుల గొంతును శాసనమండలిలో వినిపించి నిరుద్యోగ నిర్మూలనకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గం ఇన్చార్జి డా. రాజా రమేష్, పట్టణ నాయకులు జే రవీందర్, బండారి సూరిబాబు, మద్ది శంకర్, కనకం రవీందర్, పల్లె నరసింహులు, బండ రవి, టీబీజీకేస్ కేంద్ర కమిటీ నాయకులు సంపత్ కుమార్, ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్ లు పాల్గొన్నారు.