కరీంనగర్ (విజయక్రాంతి): మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్ట్ ను సివిల్ సప్లయ్ కమిషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ఖండించారు. మంగళవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం కక్ష కట్టి హరీష్ రావును అరెస్ట్ చేశారని అన్నారు. మాకు అరెస్టులు కొత్త కాదని ఉద్యమంలో అరెస్ట్ లకు బయపడలేదు, ఎన్ని నిర్బందాలు ఎదురైన ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. పౌరసరఫరాల శాఖ గన్ని బ్యాగుల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు పంపడానికి 69 కోట్ల కుంభకోణంకు పాల్పడ్డారని టెండర్లను రద్దు చేయకుంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు.