calender_icon.png 30 March, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ దీక్ష స్వాముల భిక్షా కార్యక్రమంలో పాల్గొన్న ఏనుగు మంజుల రవీందర్ రెడ్డి

27-03-2025 06:17:53 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో గురువారం వెంకటేశ్వర స్వామి మందిరం దగ్గర ఏర్పాటు చేసిన హనుమాన్ దీక్ష స్వాముల భిక్షా కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి దంపతులు పాల్గొనీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి సతీమణి ఏనుగు మంజుల, మాజీ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల పోరం అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు, బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి అంజవ్వ గణేష్, మండల పార్టీ అధ్యక్షులు నందు పటేల్, మాజీ ఏఎంసి చైర్మన్ పాత బాలకృష్ణ, కామారెడ్డి జిల్లా ఫిషరీష్ చైర్మన్ సత్యనారాయణ, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు భాను, నవీన్ రెడ్డి, హన్మాజీపేట్ వెంకట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.