హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): త్వరలో జరగనున్న వరంగల్, ఖ మ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ని యోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూల రవీందర్ పోటీ చేయనున్నారు. సోమవారం హై దరాబాద్‌లో మీడియా సమావేశంలో ఎ మ్మెల్సీ అభ్యర్థిగా రవీందర్‌ను ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రకటించింది.
ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు కో సం పోరాడతానన్నారు. పదవిలో లేకపోయి నా గతంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పనిచేశానన్నారు. ప్రమోషన్లు, బ దిలీలు, 2008 డీఎస్సీ అభ్యర్థులు, కేజీబీవీ టీచర్ల సమస్యలు, హెల్త్‌కార్డులు, పీఆర్సీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు.
ఈ సమావేశంలో జాక్టో నేతలు సదానందంగౌడ్, కృష్ణుడు, పర్వత్‌రెడ్డి, చెన్నయ్య, రాధా కృష్ణ, అబ్దుల్లా, బ్రిజేశ్, ఇతర ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నేతలు పాల్గొన్నారు.