23-03-2025 06:51:16 PM
మందమర్రి (విజయక్రాంతి): అంతర్జాతీయ కవితా దినోత్సవం, ఉగాది పండగ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ శ్రీ కళావేదిక ఆద్వర్యంలో నిర్వహించిన ఉగాది - నగదు బహుమతుల కవితల పోటీలో మండలంలోని పోన్నారం గ్రామానికి చెందిన కాపురపు రవికుమార్ (విరాగి) ప్రథమ బహుమతి అందుకున్నారు. 500కి పైగా కవులు పాల్గొన్న పోటీల్లో ప్రథమ స్థానం పొందారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, భీమన్న సాహితీ నిధి ట్రస్ట్, శ్రీ శ్రీ కళావేదికలు సంయుక్తంగా డా.బోయి భీమన్న జీవితం-సాహిత్యం మీద నిర్వహించిన జాతీయ సదస్సులో నగదు బహుమతి అందుకున్నారు. పద్మభూషణ్ డా బోయి భీమన్న సతీమణి, డా" బోయి హైమావతి, శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ డా.కత్తిమండ ప్రతాప్ ల చేతుల మీదుగా బహుమతి, సత్కారం అందుకున్నారు. ఈ పోటీల్లో గెలుపొందడం పట్ల రవి కుమార్ కుటుంబసభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని కవితా పోటీల్లో పాల్గొని అత్యుత్తమ బహుమతులు, పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.