calender_icon.png 4 April, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రావి శ్రీనివాస్ క్షమాపణలు చెప్పాలి

24-03-2025 01:34:02 AM

సిర్పూర్ యు, మార్చి23: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పై కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ రావి శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తు న్నామని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క అన్నారు.

ఆదివారం లింగాపూర్ మండలం లోని చోర్ పల్లి  గ్రామంలో విలేకరుల సమావేశం లో ఆమె కాంగ్రెస్ పార్టీ మహిళలతో కలిసి మాట్లాడారు. రావి శ్రీనివాస్ తన స్వార్థ రాజకీయాల కోసం మంత్రి సీతక్కను కించపరిచేలా మాట్లాడడం సరికాదని,మాట్లాడే ముందు సీతక్క గత చరిత్రను తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

వెనుకబడిన వర్గాల ప్రజలను చైతన్య పరచటానికి అరణ్యం నుండి జనారన్యంలోకి వచ్చిన సీతక్క అంచలంచలుగా ఎదుగుతూ మంత్రి స్థాయికి ఎదిగారని అలాంటి ఆదివాసి బిడ్డపై రావి శ్రీనివాస్ ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.  కోవా ఇందిరా, యశోద, ప్రతిభ, లక్ష్మి, సుమ, విజయ,దుర్గం కళావతి, వేణి,కుంరం సింధు, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.