calender_icon.png 30 April, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతిలో నిజాంసాగర్ మండల టాపర్ గా రవి..

30-04-2025 05:38:17 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విలువరించిన పదవ తరగతి ఫలితాల్లో నిజాంసాగర్ మండల టాపర్ గా తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన రవి 600 మార్కుల గాను 565 మార్కులు సాధించి నిజాంసాగర్ మండల టాపర్ గా నిలిచారు. నిజాంసాగర్ మండల విద్యాశాఖ అధికారి తిరుపతి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నిజాంసాగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100 శాతం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అచ్చంపేట 97.5, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లూరు 96, కస్తూరిబా గాంధీ విద్యాలయం 95, తెలంగాణ మోడల్ స్కూల్ 99, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల 98.5 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 340 మంది విద్యార్థులు పరీక్ష హాజరుకాగా 334 మంది విద్యార్థులు ఆయన పేర్కొన్నారు.