calender_icon.png 11 January, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా రవి

01-01-2025 12:35:40 AM

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చావ రవి, ప్రధాన కార్యదర్శిగా ఏ వెంకటి, ఉపాధ్యక్షులుగా కే జంగయ్య, సీహెచ్ దుర్గాభవాని, కోశాధికారిగా టీ లక్ష్మారెడ్డితో  పాటు మరో 16 మంది కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.

గత నెల 28, 29, 30 తేదీల్లో నల్గొండ జిల్లాలో జరిగిన సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా నూతన కమిటీ ఎన్నిక జరిగిందని నూతన అధ్యక్షుడు చావ రవి తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చేతుల మీదుగా యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించామని తెలిపారు.