లండన్: తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ సుందరాంగి.. రవీనా టాండన్ లండన్ లో తన అభిమాన గణం అత్యుత్సాహం చూసి భయబ్రాంతులకు గురయ్యారు. కానీ వాళ్ల మనోభావాలు గాయపడి ఉంటాయన్న బెంగతో తాను చేసిన పనికి తానే నొచ్చుకున్నారు. తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన వారికి సెల్ఫీ ఇవ్వకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయినందుకు బాలీవుడ్ నటి రవీనా టాండన్ క్షమాపణ చెప్పారు. తాను అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇటీవల రవీనా లండన్ కు వెళ్లారు. అక్కడ రోడ్ పై ఒంటరిగా వెళ్తుండగా కొందరు ఆమె వద్దకు వచ్చి సెల్ఫీ అడిగారు. అయితే ఆమె ఫొటో ఇవ్వకుండా, సెక్యూరిటీని పిలిచి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.
ఈ మేరకు ఎక్స్ నేనేపథ్యంలో రవీనా తన మనోభావాలను పంచుకున్నారు. వారికి ఫొటో ఇవ్వాలని తనకు అనిపించినప్పటికీ ధైర్యం చేయలేకపోయానని రవీనా చెప్పారు. మీకు ఫొటో నిరాకరించినందుకు తనను క్షమించాలని ఆమె అన్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని మళ్లీ కలవాలనుకుంటున్నానని... మీతో ఫొటో దిగాలని కోరుకుంటున్నానని చెప్పారు.