calender_icon.png 22 September, 2024 | 6:51 PM

మాదాపూర్ లో రేవ్ పార్టీ.. ఐదుగురిపై కేసు నమోదు

25-07-2024 09:20:55 PM

హైదరాబాద్: మాదాపూర్ లో రేవ్ పార్టీని తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి భగ్నం చేశారు. మాదాపూర్ లోని క్లౌడ్ 9 హోమ్స్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతుందని రంగారెడ్డి జిల్లా ఎస్ టీఎఫ్ పోలీసులకు సమాచారం అందడంతో రేవ్ పార్టీపై దాడి చేశారు. రేవ్ పార్టీలో విదేశి మద్యం, కొకైన్, ఎండీఎంఏ, ఇతర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం రూ.1.25 లక్షల విలువ చేసే మద్యం, డ్రగ్స్ సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రేవ్ పార్టీలో 4 మంది యువకులు, ఆరుగురు యువతులు పాల్గొన్నారు. బేగంపేట్ కు చెందిన నాగరాజు పుట్టినరోజు సందర్భంగా రేవ్ పార్టీ నిర్వహించినట్లుగా విచారణలో తేలింది. రేవ్ పార్టీ నిర్వాహకులు ఐదుగురిపై కేసు నమోదు చేసి, మిగిలిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఈవెంట్ ప్రమోటర్ కిషోర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.