calender_icon.png 14 October, 2024 | 5:58 AM

ఆ గ్రామంలో రావణుడికి పూజలు

14-10-2024 03:45:56 AM

మధ్యప్రదేశ్‌లోని రావణ్ పంచాయత్‌లో 500 యేళ్లుగా కొనసాగుతున్న ఆచారం

భోపాల్, అక్టోబర్ 13: భారత దేశమంతటా రావణుడిని రాక్షసుడిగా భావిస్తుంటా రు.. ఈ క్రమంలోనే విజయదశమి నాడు రావణ దహనం చేస్తుంటారు. అయితే మన దేశంలోనే రావణుడని దేవుడిగా పూజించే చాలా గ్రామాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో రావణ్ గ్రామంలో రావణుడిని దేవుడిగా పూజిస్తారు.

వాస్తవానికి రావణుడి భార్య మండోదరి ఈ ప్రాంతానికి చెందిన కుమార్తె అని ఇక్కడ నమ్ముతారు. దీంతో ఇక్కడ నివసించే ప్రజలు రావణుడిని తమ అల్లుడిగా భావిస్తారు. దీనికి తోడు రావణుడి గౌరవార్థం ఇక్కడ ఒక ఆలయం కూడా నిర్మించారు. గ్రామస్తులందరు రావణుడిని తమ కులదేవత ‘రావణ్ బాబా’గా పిలుస్తుంటారు. అలాగే గ్రామంలో ఎవరి వివాహం జరిగినా మొదటి ఆహ్వానం రావణుడి ఆలయంలోనే ఇస్తారు.