17-12-2024 01:10:28 AM
* తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రికి తరలింపు
* కీసర జ్యోతిబాఫూలే బాలికల గురుకులలో ఘటన
మేడ్చల్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో కొత్త మోనూ ప్రకటించి సంబురాలు జరుపుకొని రెండు రోజులు గడవకముందే ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కొరకడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలోని జ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి రమ్య, కీర్తి, హాసిని, ప్రణవి, మాధవి అనే విద్యార్థినులను ఎలుకలు తీవ్రంగా కరిచాయి.
అయితే విషయం బయటకు పొక్క కుండా గుట్టుచప్పుడు కాకుండా సోమవా రం విద్యార్థినులను చికిత్స నిమిత్తం కీసరలో ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు సిబ్బంది. వైద్యులు పరిశీలించి చికిత్సచేసి పంపించా రు. అయితే ఈ విషయమై సిబ్బంది.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వేరేవారి ద్వారా విషయం తెలసుకున్న తల్లిదండ్రులు సిబ్బంది తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. కీసర గురుకులం చుట్టూ చెట్లు ఉండటం, హాస్టల్ గదుల తలుపులకు రంధ్రాలు ఉండటంతో తరచూ పురు గులు, కీటకాలు లోపలికి వస్తున్నాయని వి ద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డొల్లతనం బయట పడింది: హరీశ్‌రావు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘గురుకులం బా ట’ డొల్లతనం 24 గంటల్లోనే బయటపడిందని మాజీ మంత్రి హారీశ్‌రావు అన్నారు. కీసరలోని గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కొరికిన విషయమై ఆయన ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. కాంగ్రెస్ పాలనలో ఎలుక, పాము, కుక్క కాట్లు, కరెంట్ షాక్‌లతో విద్యార్థులు తల్లడిల్లుతు న్నా పట్టించుకోని దుస్థితి ఉందన్నారు.