బెల్లంపల్లి (విజయక్రాంతి): కాసిపేట మండలంలోని సోమవారం బ్రిడ్జి మూలమలుపు వద్ద రోడ్డు పూర్తిగా చెడిపోవడంతో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రత్నం ప్రదీప్ తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. ఈ బ్రిడ్జి మూలమలుపు వద్ద నిత్యం సింగరేణి ఓపెన్ కాస్ట్ కార్మికులు, ప్రైవేటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రత్నం ప్రదీప్ మరమ్మతు పనులకు ముందుకు వచ్చారు. చెడిపోయిన రోడ్డుకు మరమ్మతు చేయించడం పట్ల సింగరేణి కార్మికులు, కాసిపేట మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.