25 May, 2026 | 3:31 AM

టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులుగా రత్నం

25-05-2026 12:00 AM
  1. కార్యదర్శి, కోషాధికారిగా రమేష్, శ్రీనివాసరావు
  2. ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం

భద్రాచలం, మే 24, (విజయక్రాంతి): టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులుగా రత్నం, ప్రధాన కార్యదర్శిగా జునుమాల రమేష్, కోషాధికారిగా శీమకుర్తి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా 3వ మహాసభ ఆదివారం జిల్లా కేంద్రంలోని కొత్త గూడెం క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా మహాసభఆమోదించింది.  కోశాధికారితో పాటు తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు విరహత్ అలీ, రామ్నారాయణ, జర్నలిస్టు నాయకులు వేణు, వెంకట్రావు. ఏనుగు వెంకటేశ్వరరావు, శ్రీనివాన్తో పాటు జిల్లాలోని జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.

ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ ఎన్నిక

ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీని కూడా ఈసందర్భంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఆర్ నవీన్, ప్రధాన కార్యదర్శిగా జి నాగచంద్ర, కోషాధికారిగా ఎన్ రాజేష్ తో పాటు ఉపాధ్యక్షులుగా ప్రభుదాస్, ఈశ్వర్, సహాయ కార్యదర్శులుగా టి రవికుమార్, శ్రీహరితో పాటు మరో 13 మందిని ఇసి మెంబర్స్గా ఎనుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.