భువనేశ్వర్, జూలై 18: పూరి క్షేత్రం జగన్నాథుని రత్నభండార్‌ను హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్థ్ ఆధ్వర్యంలో గురువారం ఆలయ అధికారులు మరోసారి తెరిపించారు. ౪ దశాబ్దాల తర్వాత ఈ నెల 14న ఆలయ అధికారులు గదిని మొదటిసారి తెరిపించారు. నిధిని మొత్తం మూడు గదుల్లో భద్రపరచగా, రెండు గదుల్లో కర్రపెట్టెలు, భోషాణాల్లోని సంపదను కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య చంగడా గోపురంలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఈ ప్రక్రియ జరుగుతుండ గా పొద్దుపోవడంతో రహస్య గది అయిన మూడోగదిని తెరిచేందుకు వీలు కాలేదు.దీంతో మేజిస్ట్రేట్ సమక్షంలో అధికారులు గదులకు సీల్ వేశారు.