calender_icon.png 6 February, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ షాపు సీజ్..

06-02-2025 07:49:45 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో గల రేషన్ షాపు(నెంబర్-15)ను రెవెన్యూ అధికారులు గురువారం సాయంత్రం సీజ్ చేశారు. రేషన్ షాపులో ఉండాల్సిన కోటా కంటే అధికంగా బియ్యం నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించి తహశీల్దార్ రఫతుల్లా హుస్సేన్, డిప్యూటీ తహశీల్దార్ మధుసూదన్, ఆర్ ఐ అజీజ్ అబ్దుల్, సిబ్బందితో కలిసి షాపులో తనిఖీలు నిర్వహించి దుకాణాన్ని సీజ్ చేశారు. షాపునకు కేటాయించిన కోటా కంటే అధనంగా 9 క్వింటాళ్ల బియ్యం ఉండటంతో సీజ్ చేసి, డీలర్ గద్దల వెంకటస్వామిపై కేసు నమోదు చేశారు. తనిఖీలో ఎంఆర్ఐ స్వప్న, సీనియర్ అసిస్టెంట్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.