11-03-2025 10:55:19 PM
అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టింపు కరువు..
డీలర్లపై చర్యలు శూన్యం..
కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అందజేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో పక్కదారి పడుతున్నాయి. తరచూ టాస్క్‌ఫోర్స్, పౌరసరఫరాల శాఖ, పోలీస్ శాఖ దాడులు నిర్వహిస్తున్నా రేషన్ బియ్యం దందా ఆగడం లేదు. బిచ్కుంద మండల కేంద్రంతో పాటు గుండెకల్లుర్ గ్రామంలో రేషన్ దుకాణాల్లో భారీ ఎత్తున బియ్యం పక్కదారి పడ్డాయని రేషన్ డీలర్ పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని రేషన్ దుకాణం 20 లో సుమారు 60 క్వింటాళ్ల వ్యత్యాసం గుండెకల్లుర్ గ్రామంలో సుమారు 50 క్వింటాళ్ల వ్యత్యాసం ఉన్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
అదేవిధంగా గుండెకల్లుర్ గ్రామంలో నూతన డీలర్ కు ఇంచార్జీ ఇవ్వకుండా ఓ అధికారి అడ్డుపడుతున్నారని తెలుస్తోంది. అంతేగాకుండా సదరు ఈ డీలర్ ప్రజల నుంచి వేలిముద్రలు తీసుకొని బియ్యం ఇవ్వలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఈ డీలర్ పై అభియోగాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. అక్రమాలకు పాల్పడిన సదరు ఆ రేషన్ డీలర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత రేషన్ డీలర్ల పై ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తాసిల్దార్ సురేష్ ను విజయక్రాంతి వివరణ త్వరగా తమకు ఫిర్యాదు రావడంతో విచారణ జరుగుతున్నామని తెలిపారు.