13-02-2025 10:53:53 PM
26 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్న హయత్ నగర్ పోలీసులు...
ఎల్బీనగర్: అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని గురువారం రాత్రి హయత్ నగర్ పోలీసులు పెట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. విశ్వసనీయ సమాచారంతో బంజారా కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం గోదాంపై హయత్ నగర్ పోలీసులు దాడి చేసి సుమారు 26 క్వింటాల బియ్యం, 3 తూకం మిషన్లు, 3 యాక్టివా బైక్ లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎండీ మోసిన్ అదుపులోకి తీసుకుని విచారించగా... మోసిన్, సలీం, శ్రీకాంత్ ప్రజల వద్ద నుంచి రేషన్ బియ్యం రూ. 10లకు కొనుగోలు చేసేవారని తెలిపారు. సేకరించిన రేషన్ బియ్యాన్ని కిరాయికి హయత్ నగర్ డివిజన్ లోని బంజారా కాలనీలో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచారు. వాటిని జాహీరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్మడానికి సిద్దంగా ఉండగా , సుమారు 58 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీజ్ చేసి, కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ తెలిపారు.