calender_icon.png 15 March, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ బియ్యం పట్టివేత

17-12-2024 12:41:35 AM

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 16: ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని ఓ రైస్‌మిల్ వద్ద భారీ ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. మంగళ్‌పల్లి పరిధిలోని ప్రేమ్ రైస్‌మిల్ వద్ద ఉన్న షెల్టర్‌లో రేషన్ బియ్యం నిల్వచేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు.. ఇబ్రహీంపట్నం ఎస్ ఐ చందర్‌సింగ్ సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. 14 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడు నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.