ఆదిలాబాద్ నుంచి మహారాష్ర్టకు తరలింపు
ఆదిలాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా అక్రమార్కులకు చెక్ పడట్లేదు. ఆదిలాబాద్ జిల్లా నుంచి మహారాష్ర్టకు యథేచ్ఛగా రేషన్ బియ్యాన్ని తరలిస్తూనే ఉన్నారు. అక్రమంగా తరలిస్తున్న వందల కింటాళ్ల బియ్యం పోలీసులు స్వాధీనం చేసుకోగా, తాజాగా మరో లారీని జైనథ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ గౌష్ అలం ఆదేశాలతో.. డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆధర్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.
జైనథ్ మండలం బోరజ్ వద్ద జాతీయ రహదారిపై సీఐ సాయినాథ్ ఆధర్యంలో గురువారం వాహనాల తనిఖీలు చేపట్టగా.. ఓ లారీలో 280 కింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. లారీ డ్రైవర్‌ను విచారించగా నిర్మల్‌లోని అన్నపూర్ణ రైస్‌మిల్ నుంచి మహారాష్ర్టలోని గొండియా జిల్లా విలాస్ రైస్ మిల్లుకు తరలిస్తున్నామని ఒప్పుకొన్నారు. వారిపై కేసు నమోదు చేసి, బియ్యాన్ని సాధీనం చేసుకున్నట్టు సీఐ వెల్లడించారు.