calender_icon.png 19 January, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ బియ్యం, గోధుమలు పట్టివేత

11-09-2024 02:54:02 AM

బర్రెల షెడ్‌లో నిల్వచేసిన అక్రమార్కులు

దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు

చేవెళ్ల, సెప్టెంబర్ 10: శంకర్‌పల్లి మండ లం మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం, గోధు మలను సివిల్ సప్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ కథనం ప్రకారం.. శంకర్‌పల్లి మండ లం మిర్జాగూడ పంచాయతీ పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్‌లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశారని సమాచారం అం దడంతో మంగళవారం తెల్లవారుజామున సివిల్ సప్లు ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.

ఓ బర్రెల షెడ్డులో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం, గోధుమలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు లోడ్ చేసిన హర్యానాకు చెందిన లారీని సీజ్ చేసి మోకిలా పీఎస్‌కు తరలించారు. షెడ్డులో ఉన్న బియ్యం, గోధుమలను మరో లారీలో లోడ్ చేయించి చేవెళ్లలోని సివిల్ సప్లు గోడౌన్‌కు పంపించారు. మొత్తం 38 టన్నుల 300 కిలోల రేషన్ బియ్యం, 11 టన్నుల 250 కిలోల గోధుమలను స్వాధీనం చేసుకొని పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రఘునందన్ తెలిపారు.

సీజ్ చేసిన లారీ డ్రైవర్లను అడిగితే మహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి పేరు చెబుతున్నారని, విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు. కాగా, రేషన్ బియ్యాన్ని కొందరు ముఠాలుగా ఏర్పడి నగర శివారులోని గ్రామాల నుంచి కిలో రూ.10 నుంచి రూ.15కు సేకరించి డంప్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించి రూ.30కి అమ్ముతున్నట్లు 

సమాచారం.