calender_icon.png 9 January, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మంలో రేషన్ మాఫియా

28-10-2024 01:11:26 AM

  1. జిల్లా సరిహద్దులు దాటించి, కాకినాడ పోర్టుకు తరలింపు 
  2. సముద్రమార్గం ద్వారా ఆఫ్రికా దేశాలకు రేషన్ బియ్యం 
  3. ఎక్కడికక్కడ ముడుపులు అప్పగింత

ఖమ్మం, అక్టోబర్ 2౭ (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం ప క్కదారి పడుతోంది. రేషన్ మాఫియా గ్రామా ల్లో ప్రజల వద్ద కొని దారి మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నది. రేషన్ దుకాణాల్లోనూ బియ్యాన్ని సేకరించి పక్క రాష్ట్రాలతో పాటు ఆఫ్రికా దేశాలకూ తరలిస్తున్నారు.

ఎక్కడికక్కడ అధికారులకు ముడుపులు ఇస్తూదం దా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారు ల కనుసన్నల్లోనే ఈ తతంగమంతా జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. అయితే కొనిసార్లు బియ్యం పట్టుబట్టడటం, కేసులు నమోదు చేయడం షరామామూలైంది. ఎక్క డా కూడా నిందితులకు శిక్షలు పడిన దాఖలాలు లేవు. పట్టుబడిన వాహనాలను కూడా ఎంతో తేలికగా బయటకు తీసుకెళుతున్నారంటే దందా ఏ రీతిలో జరుగుతుందో వేరే చెప్పనక్కర్లేదు. 

కాకినాడ నుంచి ఆఫ్రికా..

జిల్లాలో రోజూ వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడుతూనే ఉంది. ప్రతి గ్రామంలో మాఫియాకు సంబంధించిన వ్యక్తులు పని చేస్తున్నారనే ఆరోపణలు న్నా యి. వారికి స్థానిక నేతల అండదండలున్నా యి. దొడ్డి దారిన సేకరించిన రేషన్ బియ్యాన్ని జిల్లా సరిహద్దుల ద్వారా ఏపీలోని కాకినాడ పోర్టుకు తరలించి, అక్కడి నుంచి సముద్రమార్గం ద్వారా అఫ్రికా దేశాలకు సరఫరా చేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి.

అశ్వారావుపేట, భద్రాచలం, బోనకల్లు, వత్సవాయి మీదుగా జిల్లా సరిహద్దులు దాటి ఏపీలోని కాకినాడ, విశాఖపట్నం పోర్టులకు చేరు తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ తరలింపు లో ఎక్కడికక్కడ పోలీసులకు ముడుపులు ఇ స్తూ కాకినాడ పోర్టుకు తరలించుకుపోతున్నారనే ఆరోపణలున్నాయి. సివిల్ సప్లయ్ అధి కారులు, సిబ్బందికి సైతం భారీగానే ముడు పులు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి.

ఈ ప్రాంతాల్లో జోరుగా..

ఖమ్మం జిల్లాలోని ముదిగొండ, కూసుమంచి, పెనుబల్లి, కల్లూరు, చింతకాని, బోనకల్లు, వైరా, కొణిజర్ల, ఎర్రుపాలెం, మధిర, సత్తుపల్లి ప్రాంతాల్లో రేషన్ దందా జోరుగా నడుస్తోంది. జిల్లాలో ముగ్గురు మంత్రులు న్నా ఈ రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు పోలీసులు, పౌరసరఫర శాఖ అధికారులు కలిసి రెండు వందలకు పైగానే కేసులు నమోదు చేశారు. కానీ ఎంత మందికి శిక్షలు పడ్డాయన్నది జగమెరిగిన సత్యం. రేషన్ బియ్యంతో పట్టుబడిన వ్యాపారులు నాయకుల అండతో బయటకు వచ్చి, యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించడం పరిపాటైంది.