మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని మొదటి జోన్ కు చెందిన రేషన్ డీలర్ నాగ సుధారాణి ఉత్తమ రేషన్ డీలర్ గా ఎంపికయ్యారు. జిల్లాలోని 18 మండలాల్లో చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు నిరుపేదలకు సకాలంలో అందించడంలో చేసిన ఉత్తమ సేవలకు గాను పట్టణానికి చెందిన నాగ సుధారాణినీ ఉత్తమ డీలర్ గా ఎంపిక చేసి జిల్లా కేంద్రంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవం వేడుకలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఉత్తమ డీలర్ గా ఎంపికై ప్రశంసా పత్రం అందుకున్న సుధారాణి మాట్లాడుతూ... తనకు ప్రశంసా పత్రం రావడానికి సహకరించిన రేషన్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులకు, మండల తహసిల్దార్ సతీష్ కుమార్ కు కృతఙ్ఞతలు తెలిపారు.