calender_icon.png 28 March, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సు క్రింద పడి రేషన్ డీలర్ మృతి

21-03-2025 04:34:35 PM

పెబ్బేరు: మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ కాలనీ వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... చెలిమిల్ల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ వడ్డె హనుమంతు(53) కోదాడ డిపోకు చెందిన ఆర్టీసి బస్సు కర్నూలు వెళుతున్న క్రమంలో వనపర్తి బస్సు ఎక్కి పెబ్బేరు చౌరస్తాలో దిగాల్సి ఉంది. స్థానిక అంబేద్కర్ కాలనీ వద్ద బస్సు దిగే క్రమంలో అదుపు తప్పి బస్సు క్రింద పడ్డాడు. బస్సు వెనుక టైర్లు ఎక్కటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ సిబ్బంది వెనకాల లారీ వస్తుండటంతో బస్సు ప్రక్కకు తీసే క్రమంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చెపట్టారు.