calender_icon.png 31 January, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ

22-01-2025 12:56:47 AM

సంగారెడ్డి కలెక్టర్  క్రాంతి వల్లూరు 

సంగారెడ్డి, జనవరి 21 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లో అక్రమాలు జరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం  పథకాలు  అందేలా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్  క్రాంతి వల్లూరు  తెలిపారు. మంగళవారం కంది మండలం,  చేర్యాల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు కలెక్టర్  క్రాంతి వల్లూరు  హాజరయ్యారు. 

గ్రామాలలో  రెవిన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు , పంచాయతీ రాజ్ అధికారులతో సంయుక్త సర్వే  బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించామన్నారు.సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా  క్రింద రూ. 12 వేలు  ప్రతి ఏటా  పెట్టుబడి సాయం అందిస్తుందని  తెలిపారు. గ్రామాలలో  సాగుకు  యోగ్యం కానీ వ్యవసాయ భూముల వివరాలు  జాబితా  గ్రామసభలు  తెలియజేయడం జరుగుతుందని తెలిపారు .

ఇందిరమ్మ  ఆత్మీయ భరోసా కోసం ఉపాధి హామీ పథకంలో 23 -2024 సంవత్సరంలో 20 రోజులు  పనిచేసిన  కూలీలకు  ఇందిరమ్మ ఆత్మీయ  భరోసా కోసం ఎంపిక  చేయనునట్లు  తెలిపారు. నూతన రేషన్ కార్డుల కోసం గ్రామంలో వచ్చిన  దరఖాస్తులు నమోదు చేయడం జరుగుతుంద న్నారు.   రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. 

గ్రామ సభలలో దరఖాస్తులు  జేయవచ్చని, వీలుపడని  ఈ నెల 26 తరువాత ఎప్పుడైనా మండల కార్యాలయాలలోని ప్రజా పాలన సేవా కేంద్రాలకు వెళ్లి సంబంధిత పత్రాలను జాతచేస్తూ దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి, అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విజయలక్ష్మి , స్థానిక అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.