calender_icon.png 22 January, 2025 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ రేషన్‌కార్డులు.. ఇందిరమ్మ ఇండ్లు

22-01-2025 01:53:12 AM

  • నాలుగు పథకాల అమలుకు రూ.40 వేల కోట్లు

ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క

అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం అర్హులందరికీ రేషన్‌కార్డులు.. ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుపై మంగళవారం ఆయన రాష్ట్ర రెవెన్యూ, గృహ ని ర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎక్సుజ్‌శాఖ మంత్రి జూపల్లి కృ ష్ణారావు, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గ్రామసభల నిర్వహణ, ప్రజల స్పందనపై   కలెక్టర్లను ఆరా తీశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 24 వరకు గ్రామసభలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పథకాల లబ్ధికి గతంలో దరఖాస్తు చేసుకోని వా రు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. నాలుగు పథకాల అమలుకు రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్ల వెచ్చించనున్నదని తెలిపారు.

రేషన్‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్ర క్రియ అని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కు దరఖాస్తు చేసుకున్న వారిలో అసలు ఇల్లు లేని వారిని, జాగా ఉండి కూడా ఇల్లు కట్టుకోలేకపోతున్న వారి జాబితాను వేర్వేరుగా గ్రామసభల్లో నివేదించాలని సూచించారు.

పథకాల లబ్ధికి దరఖాస్తు చేసుకున్న వారి నుంచి పేరు, ఆధార్ కార్డు నెంబర్, చిరునామా, ఇంటి చిరునామా వంటి ప్రాథమిక ఆధారాలను సేకరించాలని ఆదేశించా రు. కాగా, తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 4,098 గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలను యంత్రాంగం విజయవంతంగా పూర్తి చేసినట్లు సీఎం శాంతికుమారి వెల్లడించారు.