మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి22 (విజయక్రాంతి): రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ఇందుకు ప్రత్యేకంగా గడువంటూ ఏమీ లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన బుధవారం జూమ్ మీటింగ్‌లో మా ట్లాడారు. గ్రామాల్లో గ్రామసభలు, రేషన్‌కార్డుల దరఖాస్తుల స్వీకరణ అంశాలపై చర్చ జరుగుతోందని.. అయితే రేషన్‌కార్డులు దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతోం దని అన్నారు.
సోసియో ఎకనమిక్ సర్వే, ప్రజాపాలన దరఖాస్తులు, కులగణన, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా రేషన్‌కార్డులను గుర్తించినట్లు చెప్పారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని... కాం గ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. ప్రతిఒక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యం ఇవ్వబోతున్నదన్నారు. 26న కొత్తకార్డుల పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.